Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడే పాత్రలో రానా!

  • 'వెల్ కం టు న్యూయార్క్' సినిమాలో సన్నివేశం
  • డ్యూయల్ రోల్ పోషిస్తున్న కరణ్ జొహార్
  • ఫిబ్రవరి 23న విడుదల
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల బారి నుంచి హీరో రానా కాపాడాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదు. 'వెల్ కం టు న్యూయార్క్' అనే బాలీవుడ్ సినిమాలో. రానా, కరణ్ జొహార్, సొనాక్షి సిన్హా, రితీష్ దేశ్ ముఖ్, బొమన్ ఇరానీ, లారా దత్తా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

 ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను విడుదల చేశారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఓ ఈవెంట్ కు వీరంతా వెళతారు. అక్కడ కరణ్ ను కిడ్నాప్ చేస్తారు. దీంతో, కరణ్ 'బాహుబలి' అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు రానా వచ్చి కరణ్ ను రక్షిస్తాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. కరణ జొహార్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ చిత్రం... ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
karan johar
rana
bollywood
welcome to newyork film

More Telugu News